Published On:

4 Dead in UP Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

4 Dead in UP Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

4 People Dead in Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ యమునా ఏరియాలోని షాద్రా చౌంగి ఫైఓవర్ పై నుంచి మామిడి కాయల లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ప్రమాదంలో ఫ్లై ఓవర్ కింద ఉన్న నలుగురు మార్నింగ్ వాకర్స్ బొలెరో కింద నలిగిపోయి చనిపోయారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

 

ఘటనాస్థలాన్ని ఏసీపీ హేమంత్ కుమార్ సందర్శించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. మామిడి కాయల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి షాద్రా చౌంగీ ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడిపోయిందన్నారు. కాగా మార్నింగ్ వాక్ కోసం వచ్చి ఫ్లై ఓవర్ కింద కూర్చున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కాగా బొలెరో డ్రైవర్, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ బొలెరో డ్రైవర్ చనిపోయారని చెప్పారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.