New Fastag System: కేంద్రం కొత్త నిర్ణయం.. ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు గుడ్ న్యూస్!
New FastTag System from August 15th: ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి టోల్ ఛార్జీలను కట్టేందుకు వాహనదారులకు ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ. 3 వేల రీఛార్జ్ తో ఫాస్టాగ్ అన్యువల్ పాస్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. కాగా ఈ పాస్ తీసుకున్న వారికి ఏడాదిలో 200 ట్రిప్పుల వరకు టోల్ గేట్ల నుంచి ప్రయాణించే అవకాశం ఉన్నట్టు కేంద్ర జల, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీంతో వాహనదారులకు ఎంతో మేలు జరగనుంది. కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆగస్టు 15 నుంచి అమలవుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఏడాదికి రూ. 3 వేల రీఛార్జ్ తో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే అవకాశం ఉంటుంది. ఈ పాస్ దేశవ్యాప్తంగా ఏ రహదారిలో ప్రయాణించినా చెల్లుతుంది. దేశంలో జాతీయ రహదారులపై నిర్బంధ రహిత ప్రయాణాన్ని లక్ష్యంగా చేసుకుని, ఫాస్టాగ్ ఆధారిత అన్యువల్ పాస్ ప్రవేశపెట్టినట్టు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వాణిజ్యేతర, వ్యక్తిగత వాహనాలకు ఈ అవకాశం కల్పిస్తున్నామని ఎక్స్ లో పోస్ట్ చేశారు.