Last Updated:

Congress Party : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం.. హైదరాబాద్ కి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే

హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనుండగా.. రేపు సాయంత్రం తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

Congress Party : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం.. హైదరాబాద్ కి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే

Congress Party : హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ సీడబ్ల్యూసీ (Congress Party) సమావేశాలు జరగనుండగా.. రేపు సాయంత్రం తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు నేతలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాయశ్రంలో వీరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అగ్రనేతలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశాల నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ కు చేరుకున్నారు.

తుక్కగూడలో జరిగే సభలో సోనియా గాంధీ సహా అగ్ర నేతలంతా పాల్గొంటారు. ఈ సభా వేదికగా రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ హామీ ఇస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను సోనియా ప్రకటించనున్నారు. అలానే మీటింగ్ కోసం ప్రత్యేకంగా వంటకాలను సిద్ధం చేశారు. అతిథులకు తెలంగాణ వంటకాలను పరిచయం చేయడంతో పాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని ప్రత్యేకంగా వడ్డించనున్నారు. దీంతో పాటు తెలంగాణ స్పెషల్స్ సర్వపిండి, జొన్న సంగటి, సకినాలు, గారెలు, మటన్ కర్రీ, చింత చిగురు మటన్ లతో పాటు మొత్తం 78 రకాల వంటకాలను సిద్ధం చేయించినట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.

 

 

ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్ని రకాల వంటకాలు ఉండేలా మెనూను సిద్ధం చేశారు.

టిఫిన్ లోకి ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, రాగి, జొన్న సంగటి, పాయా సూప్, ఖీమా రోటీ, ఫ్రూట్ సలాడ్ లను అతిథులకు వడ్డించనున్నారు.

లంచ్.. హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు.

సాయంత్రం పూట స్నాక్స్ గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, సమోసాలు, కుడుములు, మురుకులు, మొక్కజొన్న పొత్తులు, సకినాలు, గారెలు అందిస్తారు. శాకాహారుల కోసం పచ్చి పులుసు, గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, అంబలి, దాల్చా, రోటీ పచ్చళ్లను సిద్ధం చేశారు.