MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత ?
తెలంగాణలోని గోషామహల్ ఎమ్మేల్యే రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తి వేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోనుంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయనున్నట్లు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
MLA Rajasingh: తెలంగాణలోని గోషామహల్ ఎమ్మేల్యే రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తి వేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోనుంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయనున్నట్లు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని.. (MLA Rajasingh)
గోషామహల్ అసెంబ్లీ టిక్కెట్ కూడా రాజాసింగ్‌కు మళ్ళీ అధిష్టానం కేటాయించనుంది. బీజేపీ విడుదల చేయబోయే తొలి జాబితాలో రాజాసింగ్ పేరు.. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనుంచి గెలిచిన ఏకైక వ్యక్తి రాజా సింగ్. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూక్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ చర్యలో భాగంగా గత ఏడాది ఆగస్టులో రాజాసింగ్ సస్పెండ్ అయ్యారు. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీకి చెందని అగ్రనేతలు ఎవరూ రాజాసింగ్ కు సపోర్టుగా నిలిచిన దాఖలాలు లేవు. ఆయన మాత్రం పార్టీలోనే కొనసాగుతూ తమ పార్టీ నేతలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే ప్రత్యర్ది పార్టీలయిన ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలపై మాత్రం తీవ్ర స్దాయిలో విరుచుకుపడుతుంటారు. మొత్తం మీద ఎన్నికల నేపధ్యంలో ఈ ఫైర్ బ్రాండ్ ను వదులుకోరాదని బీజేపీ హై కమాండ్ భావించినట్లు తెలుస్తోంది.
మరోవైపు కాసేపట్లో బీజేపీ తొలి జాబితా విడుదల కానుంది. తెలంగాణాలో బీసీ ఎజెండాగా పనిచేయాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసింది. బిఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అమిత్ షా.. తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. మొదటి దఫాలో దాదాపు 50 మంది అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మొదటి లిస్ట్ లోనే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తేసి.. గోషామహల్ నుంచి టికెట్ ఇవ్వనున్నారు. ఈ సారి ఎన్నికల్లో కరీం నగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటల రాజెందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు. 50 మందికి టికెట్లు ఫైనల్ చేశామని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ఈ సారి బీసీలకు, మహిళలకు బీజేపీ పెద్దపీట వేసినట్టు ప్రకటించారు.