Last Updated:

Vande Bharat Express: విశాఖలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీలపై రాళ్లదాడి

ట్రయల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ బోగీలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. కంచరపాలెం సమీపంలోని రామ్మూర్తి పంతులు పేట గేటు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Vande Bharat Express: విశాఖలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీలపై రాళ్లదాడి

Vande Bharat Express: ట్రయల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ బోగీలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. కంచరపాలెం సమీపంలోని రామ్మూర్తి పంతులు పేట గేటు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాళ్లదాడిలో రెండు కోచ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆర్పీఎఫ్ పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

వందే భారత్ ట్రైన్ తయారు చేసింది ఎవరో తెలుసా..

ప్రధాని నరేంద్రమోదీ తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ నెల 15న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ రైలు విశాఖనుంచి సికింద్రాబాద్ కు 8.40 గంటల్లో చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. వందే భారత్(Vande Bharat Express)లో పూర్తిగా చైర్ కార్ బోగీలుంటాయి. వీటిలో 1100 సీటింగ్ కెపాసిటీ ఉంది. ట్రైన్ ఫ్రేమ్ పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేశారు. 80 శాతానికి పైగా రైలు భాగాలను మన దేశంలోనే తయారు చేశారు. చెన్నైలోని పెరంబూర్లో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ ట్రైన్ ను తయారుచేసింది. జీపీఎస్ ట్రాకింగ్ తో పాటు బయో వాక్యూమ్ టాయిలెట్స్ వందేభారత్ స్పెషల్.

సికింద్రాబాద్ – విశాఖ మధ్య అత్యంత వేగంగా నడిచే రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ నిలుస్తుంది. ఇంతముందు ఈ రూట్ లో నడిచే దురందో ఎక్స్ ప్రెస్ కంటే ఒక గంటన్నర ముందుగా వందేభారత్ లో విశాఖ చేరుకోవచ్చు. అంటే ఈ రూట్లో జర్నీ టైం మామూలుగా 12 గంటల టైం పడుతుండగా.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో ఆ సమయం 8 గంటలకు తగ్గుతుంది.

ఇవీ చదవండి:

Cs Somesh Kumar: మీకు కర్మసిద్దాంతం అంటే ఏమిటో తెలుసా? మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై తెలంగాణ టీచర్ సెటైర్లు

Veera Simha Reddy థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్

Ram Charan-Upasana: నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్

Veera Simha Reddy Unstoppable 2 Promo: వీరసింహారెడ్డి టీమ్‌తో బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోలో రచ్చ మాములుగా లేదుగా

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: