Prime Minister Modi: నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
నేడు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఒంటిగంట 35 నిమిషాలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్ కు వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు పాలమూరుకు చేరుకుంటారు

Prime Minister Modi: నేడు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఒంటిగంట 35 నిమిషాలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్ కు వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు పాలమూరుకు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో ప్రధాని పాల్గొననున్నారు. అనంతరం బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. సభ తర్వాత తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై విసిగిపోయారు..(Prime Minister Modi)
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అసమర్థ బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారని.. కాంగ్రెస్ పైనా ప్రజలు అంతే విసిగిపోయారన్నారని మోదీ అన్నారు. రెండు పార్టీలకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేదని ట్వీట్ చేశారు. మహబూబ్‌నగర్‌లో 13వేల,500 కోట్లకుపైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ మరోసారి దూరంగా ఉండనున్నారు. ఆయనకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- Nandamuri Balakrishna : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ “వారాహి యాత్ర”కు టీడీపీ సంపూర్ణ మద్దతు – బాలకృష్ణ
- Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు నోటీసులు..