Home / ప్రాంతీయం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ,ఏపీ ప్రభుత్వ సలహా దారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలు, పిఠాపురంవాసులకు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను ముద్రగడ కోరారు.కాగా, ముద్రగడ లేఖలో..‘గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు.
సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మా మేనిఫెస్టో ను చూసి ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం అనగా 10 వ తేదీ ఒక్కరోజు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలని కోరింది.
జరగ బోయే కురుక్షేత్ర యుద్ధం లో ధర్మం గెలవాలని చంద్ర బాబు అన్నారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స సత్యనారాయణ తాకట్టు పెట్టారని, పదవులన్నీ ఆయన కుటుంబానికేనని విమర్శించారు.
మోదీ మరలా అధికారంలోకి వస్తే వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశముందని అంటూ రాహుల్ గాంధీ అన్నారు .. .ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియా కూటమి వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పారు.
తన చెల్లి షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. షర్మిల తమ పార్టీ సభ్యురాలని తమకు పొరుగున ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలన్నారు.
హైదరాబాద్ విద్యార్థి మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికాలోని షికాగో వెళ్లాడు. వారం రోజుల నుంచి ఆయన ఆచూకీ తెలియడం లేదు. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. దీనితో 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకంది కోసం షికాగో పోలీసులు, ఇండియన్ కౌన్సేలేట్ కార్యాలయం సిబ్బంది కూడా ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే . ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.
ఈ సారి జరిగే ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. భువనగిరి లోక్‌సభ బీజేపీ ఎంపీ అభ్యర్తి బూరనర్సయ్య గౌడ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు.