Home / ప్రాంతీయం
ఇటీవల క్రమం తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి .రోడ్లు రక్తపు ఏరులై పారుతున్నాయి .తాజాగా జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.
రాయల కాలంలో రాయలసీమ రతనాల సీమగా ఒక వెలుగు వెలిగింది . ఇప్పుడు రాయల సీమ నిజంగా రతనాల సీమ మాదిరిగానే మారుతుంది . మట్టిలో మాణిక్యాలు వుంటాయని సామెత .రాయలసీమ మట్టిలో నిజంగానే వజ్రాలు దొరుకుతున్నాయి .
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వేర్వేరు ఘటనల్లో 13 మంది మృతి చెందారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
ఖమ్మం-నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్హ కొనసాగుతోంది. పట్ట భద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి.. సాయంత్రం 4 గంటల వరకు ఈసీ అవకాశం కల్పించింది.
ఏపీలో ఎన్నికల ముగిసినప్పటికీ దానికి సంబంధించిన ఘటనలు ఇంకా వెంటాడుతూనే వున్నాయి . ఒక వైపు అల్లర్లు కేసులు ,మరో వైపు ప్రముఖలు పర్యటనలో అలసత్వం చూపించినందుకు పోలీసులపై చర్యలు కొనసాగుతున్నాయి .
పాత బకాయిలు చెల్లించక పోవడంతో ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే .దింతో కొంత బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది .అయినప్పటికీ ఆస్పత్రుల యాజమాన్యం అసోసియేషన్ మొత్తం బకాయిలను చెల్లించాలని పట్టుపట్టింది.
కాపు సంక్షేమసేన అధ్యక్షులు చేగొండ హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉంటూ అధికారంలో భాగస్వామి అయితే రెండో పవర్ సెంటర్ అయ్యేది మాత్రం నిజమన్నారు.
ఉద్యోగాల పేరుతో కాంబోడియాలో మోసపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు శనివారం ఉదయం విశాఖ ఎయిర్ పోర్టుకు క్షేమంగా చేరుకున్నారు. విశాఖకు చెందిన 20 మందికిపైగా బాధితులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు, ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పతాకశీర్షికల్లో ఉంటోన్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎల్ అండ్ టీ సిబ్బందితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు 7వ బ్లాక్‌లోని 15వ గేటును ఇటీవల ఎత్తారు.
ఐటి ఉద్యోగాలకు హైదరాబాద్ స్వర్గథామంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఐటి రంగంలో అవకాశాలు తగ్గిపోతుంటే .. హైదరాబాద్ మాత్రం ఐటీ ఉద్యోగాలు పుష్కలంగా లభిస్తున్నాయని గ్లోబల్ హైరింగ్ ఫ్లాట్ ఫాం ఇండిడ్ తాజా గణాంకాలతో సహా వివరించింది.