Home / ప్రాంతీయం
వైసీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. కౌంటింగ్ రోజు పిన్నెల్లిని కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయట ఉంటే తనకు ప్రాణహాని ఉందని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ నేత గుడి కట్టించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ నేవూరి మమత-వెంకట్రెడ్డి దంపతులు సోనియాగాంధీకి పాలరాతితో గుడి కట్టించారు.
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.. బీఆర్ఎస్ సున్నా లేదా ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎప్పుడూ మాదిరిగానే మజ్లిస్ చేజిక్కించుకుంటుందని వివిధ సర్వే సంస్దలు అంచనా వేసాయి
దాదాపు రెండు నెలలు ఎన్నికల ప్రహసనం శనివారంతో ముగిసింది .ఇక రాజకీయ రాజకీయ పార్టీలకు గెలుపుఓటమి పై గుబులు పట్టుకుంటుంది .ఈ క్రమంలో వివిధ మీడియా సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ సాయంత్రనికి వచ్చాయి .దింతో కొందరికి మోదం కొందరికి ఖేదంగా మారింది .
ఏపీవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దింతో జూన్ 3 నుంచి జూన్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు సీఎం జగన్ . ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం యూరప్ యాత్రకు వెళ్లారు జగన్ . చంద్రబాబు కూడా దుబాయ్ అటు నుంచి అమెరికా వెళ్లి వచ్చారు .
గత ఐదు రోజులుగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం వలన ఇప్పటికి 9 మంది మరణించారు . అతిసారం ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా మరోకరు మరణించడంతో అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని ఏసీబీ దర్యాప్తులో తెలింది.
సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దైంది. అనారోగ్య కారణాలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా హాజరు కావడం లేదని ఏఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం రేపు హైదరాబాద్కు సోనియా గాంధీ రావాల్సి ఉంది. అయితే.. అనారోగ్యం కారణంగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో తెలంగాణ పర్యటనను సోనియా రద్దు చేసుకున్నారు.
ఏపీలో ఎండల తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు ఎక్కువ సమయాన్ని ఇళ్ళల్లోనే గడుపుతున్నారు .పైగా చల్లదనం కోసం ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు . దింతో విద్యుత్ వినియోగం పెరిగింది.