Home / ప్రాంతీయం
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది . పోస్టల్ ఓట్లలో సంతకం,సీల్ లేకపోయినా ఓట్లు చెల్లుతాయన్న గతంలో సీఈఓ ముకేశ్ కుమార్ మీనా చెప్పిన సంగతి తెలిసిందే .
: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా మరోసారి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రం పదేళ్లు తాత్సారం చేసి వందలాది మంది ఆత్మబలిదానానికి కారణం ఎవరు?
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. వైసీపీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు సజ్జల పై కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.
ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటన్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ ఇవాళ్టితో ముగియనుంది.. సాయంత్రంతో ఆయన రిటైర్డ్ కాబోతున్నారు.
కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీ బాయి (94) గురువారం ఉదయం కన్ను మూశారు. శివశంకర్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు 1979 ఉప ఎన్నికల్లో ,1980 సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు .
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలపై టీడీపీ నేతలు విరుచుకు పడ్డారు . ఏకంగా ఒక పుస్తకాన్ని విడుదదల చేసారు . ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దారుణాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్‌కుమార్‌పై వేటు పడింది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనల విషయంలో చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని సమాచారం.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ - క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కూటమి నాయకులూ ,కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేసారు .