Home / ప్రాంతీయం
Ramoji Rao: తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. రామోజీరావు శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. నిన్న ఆయన అస్వస్థకు గురికావడంతో.. హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి తరలించారు. నిన్నిటి నుంచి చికిత్స పొందుతూ.. మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయన బంధువులు తెలిపారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. అక్షర యోధుడు..( Ramoji Rao) రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం తెలిపుతున్నారు. ప్రధాని మోదీ, టీడీపీ […]
రెడ్ బుక్..ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెడ్ బుక్...ఈ పేరు వింటేనే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెడ్ బుక్ పేరు వినగానే వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. రెడ్ బుక్ సిద్ధమైందంటూ ఏపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఏపీ బేవరేజీస్ కార్పొరేష్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సీఐడీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఉదయం మూడు వాహనాల్లో వచ్చిన ఏపీ పోలీసులు హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని వాసుదేవ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు
వైసీపీ నాయకుడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
నేటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభమైంది. లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ముగియడంతో ప్రజావాణి తిరిగి ప్రారంభించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం నేటి నుంచి పునః ప్రారంభం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడం జరిగిందని తెలుస్తోంది .ఇక, సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.1992 బ్యాచ్ కు చెందిన విజయానంద్ ను సీఎస్ గా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం .
గరిలో రోజాకు మొదటి నుంచి ఇంటి పోరు ఇబ్బంది పెట్టింది . నగిరి నుంచి రోజా ఓడిపోవడంతో వైసీపీలోనే ఓ వర్గం సంబరం చేసుకుంటోంది. రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రైమ్ 9 సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్దిగా పొటీచేసి గెలిచిన నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనులు తెలిపారు. ఈ సందర్బంగా తాజా రాజకీయపరిణామాలపై చర్చించారు.
ఏపీలో ఇప్పుడు ఎవరు మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటారనే చర్చ బాగా జరుగుతోంది . 164 స్థానాలు గెలుచుకుని భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి. మొత్తం 26 మంత్రి పదవులు ఉంటాయి .