Home / ప్రాంతీయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి (సెప్టెంబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
పోలవరం పై చర్చించేందుకు టీడీపీ అధినేత ఒకరోజు అసెంబ్లీకి రావాలని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కోరారు. శాసనసభకు వస్తే టీడీపీ చేస్తున్న సవాళ్ల పై చర్చిద్దామని ఆయన అన్నారు.
అన్నమయ్య జిల్లాలోపెళ్లైన 24 గంటల్లోపే వరుడు మరణించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. శోభనం గదిలోనే వరుడు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో సీబీఐ కోర్టు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త పి. రామకోటేశ్వరరావు, , బ్యాంకు అధికారులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ. లక్ష చొప్పున జరిమానాలను కూడా కోర్టు విధించింది.
సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరారు. బుధవారం నాడు తెలంగాణ విమోచన దినోత్సవం ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.
ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ప్రయత్నాలు చేపట్టింది. దానికి గానూ ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్ఆర్టీపి అధినేత్రి షర్మిలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసులు రెడ్డికి పలువురు ఫిర్యాదు చేశారు
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలుతున్న ఘటనపై కేంద్ర రవాణాశాఖ అప్రమత్తమైంది. సికింద్రాబాద్ లోని రూబీ మోటార్స్‌లో విద్యుత్ బైక్‌ల ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది
ఆంధ్రప్రదేశ్ కు చెందిన అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను బుధవారం నాడు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆమెను అరెస్ట్ చేశారు.
అమరావతిపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు అభివృద్దికి ఏపి ప్రభుత్వం సహకారం సరిగా లేదంటూనే మూడు లేదా 4 రాజధానులు పెట్టుకోవడం అనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా చెప్పుకొచ్చారు