Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో సీబీఐ కోర్టు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త పి. రామకోటేశ్వరరావు, , బ్యాంకు అధికారులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ. లక్ష చొప్పున జరిమానాలను కూడా కోర్టు విధించింది.
Hyderabad: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో సీబీఐ కోర్టు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త పి. రామకోటేశ్వరరావు, , బ్యాంకు అధికారులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ. లక్ష చొప్పున జరిమానాలను కూడా కోర్టు విధించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రుణం తీసుకుని ఎగవేసిన విషయమై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు 2015 జూలై 11న చార్జీషీట్ దాఖలు చేసింది. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆమె భర్త విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. రామకోటేశ్వరరావుపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి చార్జీషీట్ దాఖలు చేశారు.
చార్జీషీట్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకు హైద్రాబాద్ కు చెందిన నేషనల్ బ్యాంక్ మిడ్ కార్పోరేషన్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అప్పటి బ్రాంచ్ మేనేజన్ బీకే జయ ప్రకాశం, అప్పటి జనరల్ మేనేజర్ కేకే అరవిందాక్షన్ తదితరులపై సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది. బ్యాంకు నుండి రుణం పొందేందుకు నిందితులు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చార్జీషీట్ లో సీబీఐ పేర్కొంది. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావు బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా చార్జీషీట్ లో సీబీఐ పేర్కొంది.