Home / ప్రాంతీయం
రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఏసీ సీఐడి అయిదుగురిని అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా పెదపాలెంకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు విచారణ చేసిన సీఐడి 169.27 ఎకరాలకు సంబంధించి వివరాలు సేకరించింది.
వైద్య ఆరోగ్యశాఖ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ లక్ష్మిషా ఆకస్మిక బదిలీ వివాదంగా మారుతోంది. కొంత మంది వైసీపీ పెద్దలు కావాలనే కమిషనర్‌ను బదిలీ చేయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఈ రెండింటి పేర్లతో భాజపా, టిఆర్ఎస్ పార్టీలు తెలంగాణా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయ్. ప్రజలు ఓట్లు మాకంటే మాకంటూ ఇరు పార్టీలు విమోచన దినోత్సవం, వజ్రోత్సవాలను తమ స్వార్ధానికి వినియోగించుకొంటున్నారు.
గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో విజయవాడలో జరిగిన సమావేశంలో కొడాలి నానిని ఓడించి తీరుతామని టీడీపీ నేతలు సవాల్ విసిరారు
మునుగోడులో కొద్ది రోజులుగా స్థబ్దతుగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. నేతలంతా ఒక భావోద్వేగ పూరిత వాతావరణంతో ఒక్కతాటి పైకి వస్తున్నారు. అగ్రనేత రాహుల్‌గాంధీని స్ఫూర్తిగా తీసుకుని మునుగోడు సిట్టింగ్ స్థానం పై కాంగ్రెస్ జెండా
ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా పటిష్టతపై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెరపైకి కొత్త పేరు వచ్చింది. ఇప్పటివరకు సోషల్ మీడియా బాధ్యతలు చూసిన విజయసాయిరెడ్డిని కాదని, సజ్జల తనయుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళనలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. ఆందోళనలకు సంబంధించి సమాచారం అందితే ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులకు సమాచారం ఇస్తుంటారు.
సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన అగ్రిప్రమాదం మరువకముందే హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఓ పబ్‌లో అగ్నికిలలు ఎగసిపడ్డాయి.
ఏపీతో కేంద్రం ఒక్క ఆట ఆడుకొంటున్నది. ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క మాటగా పేర్కొంటూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి కొద్ది నెలల్లో ఏపిలో ఎన్నికలు రానున్న నేపధ్యంలో రాజధాని విషయంలో మరో మెలిక పెట్టింది. దీంతో అధికార పార్టీ జగన్ కు కేంద్రం జలక్ ఇచ్చిన్నట్లైయింది.