Home / ప్రాంతీయం
ఢిల్లీ మద్యం కుంభకోణంపై కేసు నమోదు నేపధ్యంలో దేశ వ్యాప్తంగా మరోమారు దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలంగాణ సీఎం కూతురు, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకొనింది
మంత్రి జగదీశ్ రెడ్డి ని బాహుబలి తో పోల్చారు సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగానే ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. అసెంబ్లీలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేపడుతున్న మహా పాదయాత్రను అడ్డుకొనేందకు అధికార వైకాపా సిద్దమైంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి, స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు.
లంచం వద్దు. జీతమే ముద్దు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవడం అందరికి తెలిసిందే. అయితే ప్రభుత్వ అధికారుల ఆలోచనలు మారడం లేదు. సరికదా మరింతగా పెట్రేగిపోతూ, సామాన్యులను దోచుకొంటున్నారు. ఈ తరహాలోనే లంచం తీసుకొంటూ ఓ ఉన్నతస్థాయి అధికారి ఏసీబి అధికారులకు చిక్కడంతో తిరుపతి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఉదయం నుంచి కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలో దాడులు చేస్తున్నారు
జాతీయ సమైక్యతా ర్యాలీని ప్రారంభించిన వెంటనే అర్ధాంతరంగా ఆగిన ఘటన ముధోల్ జిల్లాలో చోటుచేసుకొనింది. సమాచారం మేరకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదేశాలతో అధికారులు జాతీయ సమైక్యతా ర్యాలీని చేపట్టారు.
పేదలకు అన్నం పెట్టడాన్ని కూడా ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ఎన్నో ప్రాంతాల్లో ఎవరో ఒకరు అన్నదానాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఏపీలో కేవలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ పేరుతో అన్నదానం చేస్తే మాత్రం ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు