Home / ప్రాంతీయం
తెలంగాణ విధ్యార్ధులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీఎస్ సీపీజీఈటీ 2022 ఫలితాలు ఈ రోజు విడుదల అవ్వనున్నాయి. సెప్టెంబర్ 16 న టీఎస్ సీపీజీఈటీ 2022 ఫలితాలు విడుదల చేయనున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కు సంబంధించి ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నెల్లూరు నగరంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయదశమి నుంచి బస్సు యాత్రకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా బస్సు తయారు చేస్తున్నారు. హైదరాబాద్లో తయారవుతున్న ఈ బస్సుకు రెగ్యులర్ బస్లు, లారీలకు వాడే పెద్ద టైర్లు ఉపయోగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు శుక్రవారం నాడు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి సాయంత్రం వరకు డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది. సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని పలుప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.
ప్రజా స్రవంతిలో ధరలు కట్టడి అనేది ఏ ప్రభుత్వానికైనా ఎంతో ముఖ్యం. దానిపై పాలక ప్రతిపక్షాల మద్య నిత్యం మాటలు యుద్దం జరుగుతూనే ఉంటుంది. కాని నేడు ఆదిశగా ప్రభుత్వాల అడుగులు పడడం లేదు. కేవలం ప్రతిపక్షానికి మేము ఏం జవాబు చెప్పేది అన్న కోణంలో సాగుతున్నట్లుగా శాసనసభా సమావేశాల తీరు ఉందని ఏపి అసెంబ్లీ సమావేశాలు రుజువుచేస్తున్నాయి
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు గాంధీ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాకారుడు రాజు తెలంగాణ తల్లి విగ్రహనికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్ధితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుంది. ఆయన తీసుకొనే నిర్ణయాలు సీనియర్లకు ఇష్టం లేని కారణంగా ప్రతి విషయాన్ని రాద్ధాంతం దిశగా వారు నడిపిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ నెలలో విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. విజయవాడలో జరగనున్నసిపీఎం జాతీయ మహాసభలో ఆయన పాల్గొననున్నారు
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రాత్రి 10గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నఅమిత్ షా,రాత్రి పోలీస్ అకాడమీలో బస చేస్తారు.