Last Updated:

Tirupati: తిరుపతిలో లంచగొండి అరెస్ట్

లంచం వద్దు. జీతమే ముద్దు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవడం అందరికి తెలిసిందే. అయితే ప్రభుత్వ అధికారుల ఆలోచనలు మారడం లేదు. సరికదా మరింతగా పెట్రేగిపోతూ, సామాన్యులను దోచుకొంటున్నారు. ఈ తరహాలోనే లంచం తీసుకొంటూ ఓ ఉన్నతస్థాయి అధికారి ఏసీబి అధికారులకు చిక్కడంతో తిరుపతి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది

Tirupati: తిరుపతిలో లంచగొండి అరెస్ట్

Tirupati: ఓ వ్యాపారి నుండి లంచం తీసుకొంటూ ఉండగా డ్రగ్ కంట్రోల్ అధికారిని ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న ఘటన తిరుపతిలో చోటుచేసుకొనింది. సమాచారం మేరకు పట్టణంలోని వేదాద్రి మెడికల్ ఏజెన్సీ యజమాని విజయసారధి లైసెన్సు రెన్యూవల్ కొరకు డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకొన్నారు. లైసెన్సు పున:రుద్దరణకు డ్రగ్ కంట్రోల్ ఏడీ అధికారి చక్రవర్తి 29వేల లంచం డిమాండ్ చేసాడు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా వ్యూహం ప్రకారం బాధితుడు ప్రకాశం పార్క్ దగ్గర ఏడీ చక్రవర్తికి రూ. 20 లంచం ఇస్తున్న సమయంలో మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కేసు నమోదు చేసిన అనంతరం డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో కూడా ఏసీబి అధికారులు శోదాలు చేపట్టారు.

ఏసీబి వార్తతో పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఎక్కడివారక్కడ గప్ చిప్ గా ఉండిపోయారు.

ఇవి కూడా చదవండి: