Home / ప్రాంతీయం
హవాలా నగదుకు లావాదేవీలకు దొంగ మార్గం. దీన్ని నిరోధించేందుకు నిత్యం ప్రభుత్వ వర్గాలు శ్రమిస్తుంటాయి. అయినా దొడ్డిదారిన హవాలా చేస్తున్న వ్యక్తులు కోకొల్లలు. తాజాగా హైదరాబాదులో రూ. 3.5 కోట్ల రూపాయల హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు
పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న శేషాచల కొండపైనున్న ధర్మ అప్పారాయ నిలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను వాయిదా వేసుకోవాలని మంత్రి అమర్నాధ్ విజ్నప్తి చేశారు. ఈ నెల 15న వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ గర్జన ర్యాలీ చేపడుతున్న నేపధ్యంలో మంత్రి అమర్నాధ్ పవన్ ను కోరారు
ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన కొన్ని నియమనిబంధనలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే వారిని శాశ్వతకాలం డీబార్ చేయనున్నట్టు పేర్కొనింది.
కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే ధనిసిరి అనసూయ అలియాస్ సీతక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ సంపాదించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గుత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతుల పై అధ్యయనం చేసిన సీతక్క. ఆ అంశం పై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు రూపంలో దక్కించుకున్న రూ. 18 వేల కోట్లను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే.... తాము మునుగోడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
విశాఖపట్టణంలో తనకు భూములు లేవని, తాను విశాఖలో భూములు అమ్మలేదు.. కొనలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు.
మునుగోడులో కొత్త ఓటు హక్కు, చిరునామా బదిలీల రూపంలో రికార్డు స్థాయిలో 25వేలకు పైగా దరాఖస్తులు చేసుకొన్నారు. ఇదంతా రాజకీయ దురుద్ధేశంతోనే ఇన్ని దరాఖాస్తులు నమోదు చేసుకొంటున్నారని భాజపా తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణా సర్కార్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టింది.
తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ తన జాతీయ పార్టీ కోసం భారీ నగదు వెచ్చించి ఓ చార్టర్ విమానాన్ని కొనుగోలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు కాలుదువ్వగా, తాజాగా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు