Home / ప్రాంతీయం
తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ కేసులోని నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలు ముగ్గురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
2016లో వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక మంగళవారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజులపాటు ఏపీలో మరియు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని భారత వాతారణ కేంద్రం వెల్లడించింది.
భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కేసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు పై పేర్కొన్న మాటలకు మంత్రి కేటిఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ మాట్లాడిన తీరు హస్యాస్పదంగా ఉందన్నారు. అంతర్జాతీయ నేత రాహుల్ కనీసం తన సొంత నియోజకవర్గం అమేఠీలో గెలవలేకపోయారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భాగ్యనగరంలోకి ప్రవేశించింది. శంషాబాద్ నుండి రాజేంద్రనగర్, బహదూర్ పుర, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 45 కిలోమీటర్ల వరకు రెండు రోజుల పాటు సాగనుంది.
మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు దొరికినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. రాత్రి నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరుగుతుంది. నేటితో ఈ ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ను గద్దె దింపే వరకు తన పోరాటం ఆగదని, కేసీఆర్ను ఓడిస్తానని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి శపథం చేశారు. మునుగోడులో తాను గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 15 రోజుల్లో పడగొడతామని సంచలన కామెంట్లు చేశారు.
ఆర్ కృష్ణయ్య ఒక బ్రోకర్ అని మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి మండిపడ్డారు.