Home / ప్రాంతీయం
సూపర్‌స్టార్ కృష్ణకు ఘననివాళులర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట.
2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పినట్టుగా జరుగుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడు జరుగుతుందన్నారు.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు.
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ రిపేర్లకు గురవుతోందని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అగ్ని ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత బోండా ఉమపై ట్విట్టర్లో సెటైర్లు వేసారు. రెండేళ్ల నుంచి 2000 రూపాయలనోట్లు ముద్రించనపుడు ఎలా కనపడతాయంటూ ప్రశ్నించారు. బహుశా చంద్రబాబు ఇంట్లోనే చూసి ఉంటాడంటూ చమత్కరించారు.
ఏపీ కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషధారణలో వచ్చిన దుండగుడు భిక్షాటన చేస్తున్నట్టుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పిట్టకధల మంత్రి అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారని సమాచారం.
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూశారు. అయితే ఆయన మరణానంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తన ఆస్తిపాస్తులు తన తదనంతరం ఎవరికి చెందాలనేది ఓ వీలునామా రాశారట. ప్రస్తుతం ఆ వీలునామా టాలీవుడ్ నాట విపరీతంగా ప్రచారం జరుగుతోంది.