Last Updated:

Ultimatum : ఆయుధాలిస్తేనే డ్యూటీ చేస్తాం.. ప్రభుత్వానికి ఫారెస్ట్ సిబ్బంది అల్టిమేటం

తమకు ఆయుధాలు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటూ ఫారెస్ట్ సిబ్బంది ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. అంతవరకు రేపటి నుండి విదులు బహిష్కరించాలని ఫారెస్ట్ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.

Ultimatum : ఆయుధాలిస్తేనే డ్యూటీ చేస్తాం.. ప్రభుత్వానికి ఫారెస్ట్ సిబ్బంది అల్టిమేటం

Khammam: తమకు ఆయుధాలు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటూ ఫారెస్ట్ సిబ్బంది ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. అంతవరకు రేపటి నుండి విదులు బహిష్కరించాలని ఫారెస్ట్ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మంలో గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ మృతి చెందిన నేపధ్యంలో ఫారెస్ట్ సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు.

చాలా కాలంగా తమకు ఆయుధాలివ్వాలని పారెస్ట్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అడవిలో విధులు నిర్వహించాలంటే ఆయుధాలు కావాలని కోరుతున్నారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదీవాసీలకు , ఫారెస్ట్ సిబ్బంది మధ్య వివాదాలు జరుగుతున్నాయి. గిరిజనులు, ప్రజాప్రతినిధులు, వారి బంధువులు ఫారెస్ట్ అధికారులపై దాడులకు పాల్పడ్డ సంఘటనలు తెలంగాణలో చాల జరిగాయి.

బుధవారం ఖమ్మం జిల్లాలో పారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలకు హాజరైన సమయంలో పారెస్ట్ ఉద్యోగులు, సిబ్బంది కూడా తమకు ఆయుధాలివ్వాలని నినాదాలు చేశారు. ఇదే డిమాండ్ తో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి , పువ్వాడ అజయ్ వద్ద అటవీశాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

ఇవి కూడా చదవండి: