Home / ప్రాంతీయం
సినిమా పరిశ్రమకి రాజకీయాలకి మధ్య తెలియని ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అని అందరికి అనిపిస్తుంది. సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించడం.. రాజకీయాల్లో రాణించిన వారు కూడా అడపాదడపా సినిమాల్లో మెరవడం వంటివి గతంలో జరిగాయి..
ఫార్ములా ఈ కార్ రేస్ చూడడానికి అతిరథమహారథులైన సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా హైదరాబాద్ చేరుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, చోటా పవర్ స్టార్ అఖీరా నందన్ ఈ ప్రాంగణంలో సందడి చేశారు.
E Race Hyderabad: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహించిన.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్షిప్ ముగిసింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేశారు. దీంతో తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది.
Hyderabad Metro Rail: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ మెట్రోపై కీలక ప్రకటన చేశారు. మెట్రో ధరలు పెంచితే ఊరుకోమని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపుపై అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
Hyderabad E Racing: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్‌షిప్‌నకు అట్టహాసంగా తెరలేచింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ.. ఈ ఈవెంట్ కొత్త కళను సంతరించుకుంది. సాగర తీరాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రధాన రేస్ ప్రారంభమైంది.
నందమూరి కుటుంబంలో వరుస విషాదలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే నందమూరి తారకరత్న పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఇంకా కోలుకోకముందే నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం నెలకొంది.
మారుమూల గ్రామంలో జన్మించి.. ఫుట్‌బాల్ పై మక్కువతో పట్టుదలనే ఆయుధంగా చేసుకొని ఓ బాలిక పోరాడింది. సాధారణంగా మన దేశంలో ఎక్కువ ఆదరణ క్రీడా ఏదైనా ఉంది అంటే క్రికెట్ అని నిర్మొహమాటంగా చెబుతారు. ఇండియాలో క్రికెట్ కి ఉన్నంత ఆదరణ మరో క్రీడకి లేదు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన, తెదేపా పార్టీలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి ప్రజాల్లో పెరుగుతున్న మద్దతు చూస్తుంటే అధికార పార్టీ నేతలకు వెన్నులో వణుకుపుడుతుందని అనిపిస్తుంది.
తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ బాగోతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ లిక్కర్ స్కామ్‌లో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో భాగంగా తాజాగా ఈడీ అధికారుల మరొకరిని అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.