Minister Vidadala Rajini: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న వైకాపా మంత్రి రజిని..
సినిమా పరిశ్రమకి రాజకీయాలకి మధ్య తెలియని ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అని అందరికి అనిపిస్తుంది. సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించడం.. రాజకీయాల్లో రాణించిన వారు కూడా అడపాదడపా సినిమాల్లో మెరవడం వంటివి గతంలో జరిగాయి..
Minister Vidadala Rajini: సినిమా పరిశ్రమకి రాజకీయాలకి మధ్య తెలియని ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అని అందరికి అనిపిస్తుంది.
సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించడం.. రాజకీయాల్లో రాణించిన వారు కూడా అడపాదడపా సినిమాల్లో మెరవడం వంటివి గతంలో జరిగాయి.. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి.
అయితే ప్రస్తుతం ఉన్న వారిలో మంత్రి రోజా, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలీ, పోసాని కృష్ణ మురళి.. పలువురు ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు.
కాగా గత కొద్ది రోజులుగా వైసీపీ నేత, మంత్రి విడదల రజినీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న విడదల రజినీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే అవసరమైనప్పుడు ప్రత్యర్థులపై పంచుల వర్షం కురిపిస్తుంటారామె.
అటు ఏపీ ప్రభుత్వంలోనూ, ఇటు వైసీపీ పార్టీలోనూ కీలక నాయకురాలిగా ఉన్న రజినీ(Minister Vidadala Rajini) గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి విస్తృతంగా చర్చలు కూడా జరిగాయని టాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాణ రంగంలో తన అభిరుచిని చాటుకునేందుకు రజిని ప్రయత్నాలు ప్రారంభించారని, ఒక బ్యానర్‌ను మొదలెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ లో ఒక ఆఫీసుని కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా రజిని ఎంట్రీ కోసం ఒక కథ కూడా సిద్ధమైందట. త్వరలోనే సినిమా డైరెక్టర్, హీరో, హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్లను ఫైనలేజ్ చేసి అధికారికంగా ప్రకటించనున్నారట. అయితే మంత్రి టాలీవుడ్ ఎంట్రీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రొడ్యూసర్‌గా డైరెక్టుగా సినిమాలు నిర్మిస్తారో లేదో ఫైనాన్షియర్‌గా వ్యవహరిస్తారో వేచి చూడాలి.
చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు విడదల రజిని. 2014లో తెలుగు దేశం పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత జగన్ వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరారు. 2019లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై మంత్రి వర్గ పునః వ్యవస్థీకరణలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.