Home / ప్రాంతీయం
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరో కొత్త ఆవిష్కృతం జరుగుతుంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా చేపట్టిన నూతన సచివాలయం ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సుదర్శన యాగంతో సెక్రటేరియట్ ప్రారంభోత్సవ వేడుక మొదలైంది.ఉదయం 5.50 గంటలకే పండితులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.
సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకటించింది.
ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఇది మూడోసారి. విశాఖ పట్నంలో పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా..
విజయవాడలో శుక్రవారం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకుర్పాణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య అతిధిగా వచ్చారు.
నందమూరి తారాక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై రజినీ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు ఆ కారణంగా వైకాపా నేతలు వరుసగా రజినీకాంత్ ని టార్గెట్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరుగా
వైఎస్సార్సీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తుంది. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి బాలినేని తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి పార్టీ పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
దేశ ప్రజలతో మమేకం కావలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంతో పాటు.. దేశంలో పలువురు ప్రముఖుల గురించి
శనివారం తెల్లవారు జామున నుంచి హైదరబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా సూపర్ స్టార్ రజినీ కాంత్ హాజరయ్యారు. అంతేకాదు.. ఈ సభలో తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ రజనీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ తో పాటు తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం వర్షం దంచికొట్టింది. దీంతో నగరం లోని పలు ప్రాంతాలు జలమయం అవ్వగా.. ట్రాఫిక్ నిలిచిపోయింది. అలానే విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఫిలిం నగర్, ఏఎస్ రావు నగర్