Last Updated:

Balineni Srinivasa Reddy : వైకాపాకు షాక్ ఇచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఏం జరిగిందంటే?

వైఎస్సార్‌సీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తుంది. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి బాలినేని తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి పార్టీ పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.

Balineni Srinivasa Reddy : వైకాపాకు షాక్ ఇచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఏం జరిగిందంటే?

Balineni Srinivasa Reddy : వైఎస్సార్‌సీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తుంది. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి బాలినేని తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి పార్టీ పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పట్ల ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఆయన ప్రస్తుతం స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందుతుంది.

మరోవైపు బాలినేని పార్టీ పదవికి రాజీనామా చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్పందించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నేత.. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం ఉండదన్నారు. ఆయనతో పార్టీ నేతలు మాట్లాడుతారని.. ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదే అన్నారు. ఆయన రీజినల్ కో ఆర్డినేటర్ గా తప్పుకున్నారనేది సోషల్ మీడియా ప్రచారం మాత్రమే అన్నారు.

గతంలో చేదు అనుభవమే కారణమా (Balineni Srinivasa Reddy)..

ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బంధువనే సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక జగన్ తన మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో.. బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. స్వయంగా జగన్ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్కాపురం పర్యటన సందర్భంలో కూడా ప్రోటోకాల్ రగడ జరిగింది.

సీఎం వచ్చే హెలిప్యాడ్ దగ్గరకు అనుమతించకపోవడంతో పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కార్యక్రమం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే బాలినేని సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీలు ప్రయత్నించారు. అయితే బాలినేని అక్కడి నుంచి వెనుదిరిగేందుకే నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ కాల్ వెళ్లడంతో.. ఆయన తిరిగివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.