Home / ప్రాంతీయం
రోజురోజుకు టమోటా ధరలు పెరిగిపోతుండడంతో విచిత్రమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. టమోటా దొంగతనాలు సర్వసాధారణంగా మారాయి. ఇప్పుడు అనకాపల్లి లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లిలో ఓ వ్యక్తి తన కుమార్తెకు టమోటాలతో తులాభారం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
జనసేన అధినేత నేడు తిరుపతికి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై దాడి చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అందుకు గాను ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి చేరుకున్నారు.
హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేట్ సెలబ్రిటీ క్లబ్లో జరిగిన కాల్పుల కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని సినీ నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజగా పోలీసులు గుర్తించారు. శంభో శివశంభో, వినాయకుడు తదితర చిత్రాలలో సూర్యతేజ నటించాడు. ఈ కాల్పుల కేసుకి సంబంధించి మనోజ్, స్మితని షామీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి ఘటనను సీరియస్ గా తీసుకున్న సేనాని.. సీఐ అంజూ యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా.. సేనాని ఫొటోకు పాలాభీషేకం చేశారన్న నెపంతో.. జనసేన నాయకులను అరెస్ట్ చేసి సత్యవేడు జైలుకు తరలించారు. దానిపై కూడా సేనాని ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.
హైదరాబాదులో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజా దగ్గర సింహవాహిని బోనాల పండగ సందర్భంగా.. ఆలయ కమిటీ తొలి బోనం సమర్పించింది. ప్రభుత్వం తరఫును మంత్రి తలసాని శ్రీనివివాస్ యాదవ్.. అమ్మవారికి అదికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీకాళహస్తి ఘటనపై రాష్ట్ర మానవహక్కుల సంఘం సీరియస్ అయ్యింది. జనసేన నాయకుడిపై సిఐ అంజూయాదవ్ చేయి చేసుకున్న ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కధనాలను.. సుమోటోగా తీసుకుని హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు నమోదు చేసింది. ఈనెల 27లోగా వివరణ ఇవ్వాలని సిఐ అంజూయాదవ్.. డిఎస్పీ, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్లో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులకి బాధితుడు సిద్దార్థ్ దాస్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలుగు సీరియల్ నటుడు మనోజ్ సెలబ్రిటీ క్లబ్ రిసార్ట్స్‌లో ఒక విల్లాలో సిద్దార్థ అనే వ్యక్తి భార్యతో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
AICC in Telangana: ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలుకు సైరెన్ మోగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Pawan Kalyan In Tanuku: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా ఇక మొదలుపెడదామా అంటూ స్టార్ట్ చేసిన జనసేనాని తణుకు కవి రాసిన కవితలే తనుకు ఆదర్శమని చెప్పుకొచ్చారు.