Home / ప్రాంతీయం
Former Minister Ambati Rambabu : ప్రధాని మోదీ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అసత్యాలు మాట్లాడారని మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి ఒక అంతులేని కథ అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సీఎం చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారని మండిపడ్డారు. అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.41 వేల కోట్లకు పైగా టెండర్లు పిలిచి రూ.5,500 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఐదేళ్ల […]
CM Chandrababu: ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనులు పున: ప్రారంభమయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల […]
వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ‘క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్’ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ ఏర్పాటు ఇది భారత్‌లోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహిస్తాం : సీఎం చంద్రబాబు Anaravati: అమరావతి కేంద్రంగా వచ్చే ఏడాది ఒకటో తేదీన క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ […]
Srisailam: శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకకళ్యాణార్థం ఆదిదంపతుల స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామునే శ్రీమల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. స్వర్ణరథాన్ని ఆలయ ఎదురుగల గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు.. నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు భక్తుల కోలాటాలు, మేళతాళాలతో వైభవంగా జరిగింది. స్వర్ణరథోత్సవంలో వందలాదిగా స్థానికులు, […]
Nandyal: ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కాగా బాధితులు శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తున్నట్టు బంధువులు తెలిపారు. ఘటనలో 21 మందికి గాయాలు కాగా స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలైన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితులంతా ఆదోనికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని […]
Telangana: తెలంగాణలో రానున్న మూడురోజుల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడె, నల్గొండ, జనగాం, సూర్యాపేట, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ లోనూ రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు […]
Amaravati: ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు, రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టుల పనులను వేదిక నుంచి ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు.. శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా, అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి’ […]
AP CM Chandrababu Naidu : చరిత్రలో ఇవాళ కీలకమైన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పున:నిర్మాణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను చాలాసార్లు ప్రధాని మోదీని కలిశానని, నిమిషాల కొద్ది మాట్లాడినట్లు గుర్తుచేశారు. కానీ, మొన్న కలిసినప్పుడు మోదీ కళ్లలో ఆవేదన చూశానని చెప్పారు. ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు పోయాయనే బాధ మోదీలో కనిపించిందన్నారు. మేమంతా మీతో ఉన్నామని ప్రధానికి సీఎం భరోసా ఇచ్చాడు. ఉగ్రదాడి విషయంలో ఏ […]
Amaravati: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు తలవంచి మొక్కుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ఐదేళ్లుగా వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పోలీసులతో లాఠీ దెబ్బలు బారిన పడ్డారని.. అమరావతి కోసం వారు చేసిన పోరాటాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని తెలిపారు. చివరికి 2000 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని నరేంద్ర మోదీతో రాజధాని పనులు పునఃప్రారంభించుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో […]
PM Modi : రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు సహా పలువురు మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్‌లో వెలగపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, […]