Last Updated:

Nara Lokesh: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నారా లోకేష్

అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో తనకి ముందస్తు బెయిలివ్వాలంటూ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారం మార్పులు చేసి అనుచిత లబ్ధి పొందారని సిఐడి అధికారులు నారా లోకేష్‌ని కూడా నిందితుడిగా చేర్చారు.

Nara Lokesh: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నారా లోకేష్

 Nara Lokesh:అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో తనకి ముందస్తు బెయిలివ్వాలంటూ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారం మార్పులు చేసి అనుచిత లబ్ధి పొందారని సిఐడి అధికారులు నారా లోకేష్‌ని కూడా నిందితుడిగా చేర్చారు.

ఏ14 గా నారా లోకేష్‌..(Nara Lokesh)

ఈ కేసులో ఏ14 గా నారా లోకేష్‌ని చేర్చిన సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇదే కేసులో నారా లోకేష్ తండ్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కూడా సిఐడి అధికారులు నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబుపై సిఐడి అధికారులు పిటి వారెంట్ దాఖలు చేశారు. నారా లోకేష్ తరుపున హైకోర్టులో బెయిల్‌కోసం న్యాయవాది దమ్మాలపాటి పిటిషన్ దాఖలు చేశారు. . తాజాగా నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలన అరాచకాలమయం అని, విపక్షాలను అణచివేస్తున్నారని లోకేష్  రాష్ట్రపతికి వివరించారు. ఈ సమావేశంలో లోకేశ్ పాటు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. మరోవైపు లోకేష్ ఢిల్లీలో పలు పార్టీల అగ్ర నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు.