Janasena chief Pawan Kalyan: మీ కోసం ముఠా మేస్త్రీలా పనిచేస్తాను.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన వారాహి యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో బస చేస్తోన్న జనసేనాని.. స్థానిక జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకుడు అనేవాడు కులాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదని..మనుషులను కలిపేవాడే నాయకుడన్నారు
Janasena chief Pawan Kalyan: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన వారాహి యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో బస చేస్తోన్న జనసేనాని.. స్థానిక జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకుడు అనేవాడు కులాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదని..మనుషులను కలిపేవాడే నాయకుడన్నారు. కోనసీమ వాసుల్లో ఉన్న పౌరుషం, కోపాన్ని దోపిడి చేసే వారిమీద ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ప్రజల కోసం ఎవరితోనైనా గొడవ పెట్టకోవడానికి తాను సిద్దమని..ముఠా మేస్త్రీలా మీ కోసం పనిచేస్తానని అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలని, ఆ మార్పు కోనసీమ నుండే మొదలవ్వాలని ఆకాంక్షించారు.
అమలాపురాన్ని ఏ-1గా చేద్దాం..(Janasena chief Pawan Kalyan)
కూలదోసే వాడు ఉంటే.. పడగొట్టే వాడూ ఉంటారు. విడగొట్టే వాడు ఉంటే.. కలిపే వాడూ ఉంటాడు. దౌర్జన్యం చేసేవాడుంటే వాడి తలతన్నే వాడుంటాడు. ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగేంచే వారు ఎంత తోపులైనా సరే వారితో గొడవపెట్టుకునేందుకు.. ప్రజల బాగుకోసం నేను సంపూర్ణంగా దహించుకుపోవడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ అన్నారు.
అమలాపురాన్ని ఏ-1గా చేద్దాం. అమలాపురం, కోనసీమలో పవన్ పర్యవేక్షణ ఉండాలి. కుల ఘర్షణలు నివారించాలంటే సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు ఉండాలి.
జనసైనికులు వివాదాలు, విమర్శల జోలికి వెళ్లకండ పవన్ కళ్యాణ్ అన్నారు.