Hyderabad Infants : మలక్‌పేటలో బాలింతల మృతికి కారణం ఇదే

Hyderabad: మలక్ పేట్ బాలింతల మృతి కేసులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కారణమని వైద్యులు నిర్దారించారు. మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవలే ఇద్దరు బాలింతలు Two infants died మృతి చెందారు.
మృతికి కారణం ఇదే..
నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన సిరివెన్నెల.. తిరుపతికి చెందిన మరో మహిళా శివాణి ఇద్దరు ఏరియా ఆస్పత్రిలో కాన్పు చేయించుకున్నారు. అదే రోజు ఈ ఆస్పత్రిలో మరో తొమ్మది మంది కాన్పు చేయించుకున్నారు. కాన్పు అనంతరం వీరిద్దరి పరిస్థితి విషమంగా మారడంతో.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.
ఈ ఘటనపై విచారణ జరిపిన వైద్యశాఖ అధికారులు.. ఆస్పత్రిలో బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కారణమని తెలిపారు.
ఆస్పత్రిలో పరిశుభ్రత లోపమే ఈ మరణాలకు ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు.
ఇద్దరి మృతి ఇన్ ఫెక్షన్ అని తెలియడంతో.. వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు.
వీరికన్నా ముందు సిజేరియన్ చేసిన 18 మందిని నిమ్స్ అత్యవసర విభాగానికి తరలించారు.
నిమ్స్ లో ప్రత్యేక చికిత్స
ఇందులో ఇద్దరికి కిడ్నీలకు ఇన్ ఫెక్షన్ సోకగా.. వారికి డయాలసిస్ చేస్తున్నారు.
ప్రస్తుతం వారి ఆరోగ్యం కాస్త విషమంగా ఉందని.. కోలుకోవాడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
ఆరోగ్యంగా ఉన్న మరో తొమ్మిది మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం నిమ్స్ (Hyderabad) లో ఏడుగురు బాలింతలకు చికిత్స అందిస్తున్నారు. వీరు ఆరోగ్యంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.
బాలింతల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణంటూ బంధువులు ఆరోపణలు చేశారు.
అయితే ఇందులో వైద్యుల తప్పులేదని ఉన్నతాధికారులు వాదించారు.
కానీ ఇప్పుడు ఆస్పత్రిలో అపరిశుభ్రతే ప్రధాన కారణమని తేలడంతో అధికారులు సైలెంట్ గా ఉంటున్నారు.
దీంతో తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు.
మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని కోరారు. లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని బాధిత బంధువులు హెచ్చరిస్తున్నారు.
అధికారులు సైతం ఈ విషయంపై ఆలోచించాలని కోరుతున్నారు.
బాలింతల మృతితో పసిపిల్లలు అనాధలయ్యారని.. బాధిత కుటుంబాలు బోరున విలపించాయి.
ఇలాంటి ఘటనలతో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పోతుందని విమర్శలు.
ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఆస్పత్రులపై పెరుగుతున్న నమ్మకం.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం అంటోంది.
కానీ చాలా ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/
ఇవి కూడా చదవండి:
- Mahindra XUV400: మార్కెట్లోకి మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూవీ.. తొలి 5వేల మందికే ఆ ధర
- Remote Electronic Voting Machine: రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పనితీరుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ఎన్నికలసంఘం