Last Updated:

Pawan kalyan : ఈ సారి ప్రధానిని కలిస్తే జగన్ పై కచ్చితంగా కంప్లైంట్ ఇస్తానన్న పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్ మరోసారి  వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. లాస్ట్ టైం ప్రధానిని కలిసినప్పుడు ఉత్సుకత పెద్దమనిషి సజ్జల ఏం మాట్లాడారో చెప్పాలంటే చాలా ఉత్సాహం కనపరిచారు. ఈ సారి ప్రధానిని కలిస్తే మాత్రం మీ సీఎం జగన్ పై ఓ కంప్లైంట్ ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

Pawan kalyan : ఈ సారి ప్రధానిని కలిస్తే జగన్ పై కచ్చితంగా కంప్లైంట్ ఇస్తానన్న పవన్ కళ్యాణ్..

Pawan kalyan : పవన్ కళ్యాణ్ మరోసారి  వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. లాస్ట్ టైం ప్రధానిని కలిసినప్పుడు ఉత్సుకత పెద్దమనిషి సజ్జల ఏం మాట్లాడారో చెప్పాలంటే చాలా ఉత్సాహం కనపరిచారు. ఈ సారి ప్రధానిని కలిస్తే మాత్రం మీ సీఎం జగన్ పై ఓ కంప్లైంట్ ఇస్తానని ఆయన పేర్కొన్నారు. 74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రతిసారి నరేంద్రమోదీని కలిసినప్పుడు పెద్దపెద్ద తిరుమల వెంకన్న ఫొటోలు ప్రసాదాలు ఇస్తారు.

కానీ ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు చేయిస్తూ చూస్తూ కూర్చుంటున్నారని చెప్తానంటూ ఆయన స్పష్టం చేశారు.

సనాతన ధర్మం ప్రకారం పూజలు చేస్తే.. నన్ను ప్రశ్నిస్తున్నారు.. ఓ ముస్లింనో.. క్రిస్టియన్నో నన్ను విమర్శించినట్టు.. ప్రశ్నించినట్టు విమర్శించగలరా..? అని పవన్ ప్రశ్నించారు.

హిందూ దేవుళ్లను దూషణ చేయొద్దు: పవన్ కళ్యాణ్ (Pawan kalyan)

ఇటీవల కాలంలో దేవుళ్లపై దూషణలు ఎక్కువ అవుతున్నాయన్న ఆయన.. దేవతా దూషణల వల్ల బ్రహ్మాణ కులాలకే కాదు.. సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందువును బాధ పెడుతోందన్నారు.

మహ్మద్ ప్రవక్తనో.. జీసస్ నో దూషించగలరా..? నేను ఇలా మాట్లాడతున్నానని రైట్ వింగ్ అనుకోవద్దు.. అనుకున్నా సంతోషమే అన్నారు.

హేతువాదం అనే పేరు మీద హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని విమర్శించారు.

పార్టీ నిర్మాణం అంటే చాలా కష్టం.. చాలా మంది సలహాలిస్తున్నారు. నా తాత, నాన్న సీఎంలు కాదు. పార్టీ నిర్మాణం జరగాలంటే దశాబ్ద కాలం పాటు వేచి చూడాలన్నారు.

పాలు తోడు పెడితే ఉదయానికి పెరుగు అవుతుంది.. కానీ ప్రతి పది నిమిషాలకోసారి చూస్తూ పెరుగు అవ్వలేదంటే ఎలా..? అని అన్నారు.

ఏపీకి రాజకీయ స్థిరత్వం కావాలి.. లేకుంటే అభివృద్ధి పక్క రాష్ట్రాలకు వెళ్తుందని పవన్‌ విమర్శించారు.

నేను చట్టాలను గౌరవించేవాడిని.. కోడి కత్తితో పోడిపించుకుని డ్రామాలాడేవాడిని కాను అని వ్యాఖ్యానించారు.

 

 

డబ్బులు దోచుకుని.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించే మీకే అంతుంటే.. ఏ తప్పు చేయని నాకెంత ఉండాలని పవన్ ఫైర్ అయ్యారు.

ఇవాళ దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావులను స్మరించుకోవాలి.. మతప్రతిపాదికన దేశ విభజన జరిగింది.. అహింసతో స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ.. ఆ తర్వాత విపరీతమైన హింస జరిగిందన్నారు పవన్‌.

మహనీయుల త్యాగ ఫలంతో మన జీవితం ఉందన్న ఆయన.. ఇదే సమయంలో పద్మ అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలిపారు.

తెలుగు వారికి ఈ స్థాయిలో పద్మ అవార్డులు రావడం సంతోషంగా ఉంది.. సమాజానికి ఎన్నో సేవలందించిన వారిని గౌరవించుకోవాలన్నారు.

తెలుగు అన్ సంగ్ హీరోలకు పద్మ అవార్డులిచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం పవన్ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/