Ravanasura Movie : బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన మాస్ మాహారాజ్ రవితేజ.. డిఫరెంట్ గా “రావణసుర” గ్లింప్స్
మాస్ మహారాజా ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘ధమాకా’,‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాడు రవితేజ. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘రావణసుర’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.

Ravanasura Movie : మాస్ మహారాజా ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు.
ఇటీవలే ‘ధమాకా’,‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాడు రవితేజ.
ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘రావణసుర’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.
ఇక చిత్రంలో హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజితా పొన్నాడలు నటిస్తుండటం విశేషం.
హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
ఆర్టీ టీమ్ వర్క్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఈరోజు మాస్ మహరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ఓ గిఫ్ట్ ఇచ్చారు మూవీ మేకర్స్.
అదరగొట్టిన రావణసుర (Ravanasura Movie) గ్లింప్స్..
తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు. 46 సెకండ్లు ఉన్న ఆ వీడియో థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటోంది.
వరుసగా అమ్మాయిలను హత్య చేసే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
రవితేజ కూడా మునుపటి సినిమాలలో కాకుండా డిఫరెంట్ లుక్ లో కనబడుతుండడం సినిమాపై అంచనాలను పెంచుతుంది.
ఈ గ్లింప్స్ చూస్తుంటే రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో పాటు లాయర్ గా మరో క్యారెక్టర్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ గ్లింప్స్ తో సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఇక హర్షవర్ధన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. ఇక చివరగా.. టైటిల్ కు తగినట్టుగానే పగిలిన గ్లాస్ లో రవితేజని పలు ముఖాల్లో చూపించారు.
అలానే ఈ మూవీలో హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ‘రావణసుర’ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా విడుదలైన గ్లింప్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. 2023 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
రవితేజ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావులో కూడా నటిస్తున్నాడు.
ఇటీవలే షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/
ఇవి కూడా చదవండి:
- Republic Day : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్, సీఎం జగన్
- Pawan Kalyan: నువ్ నాతో గొడవపెట్టుకో చెప్తా.. జగన్ కు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్
- Vasanta Panchami: వైభవంగా వసంత పంచమి వేడుకలు.. బాసరలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి