Home / ఆంధ్రప్రదేశ్
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. సిఐడి తరపు న్యాయవాదుల వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించి పిటిషన్ ను కొట్టేసింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నెల 21న సమావేశాలు ప్రారంభమవ్వగా.. 27వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దాంతో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారి మాటల యుద్ధానికి నేతలు సై అంటున్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చారు సీఐడీ అధికారులు. కాగా ఈ క్రమం లోనే చంద్రబాబునాయుడు రిమాండ్ ను ఈ నెల 24వ తేదీకి పొడిగించింది కోర్టు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రసాభాసగా మారింది. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితులు రిపీట్ అయ్యాయి.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పిల్ వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. కాగా ఈ క్రమం లోనే ఈరోజు కూడా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభం కాగానే ఏపీ అసెంబ్లీ స్పీకర్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబును సెంట్రల్ జైలుకు పంపించినప్పటి నుంచి ఆయన భద్రతపై టీడీపీ లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ములాఖత్ తర్వాత చంద్రబాబుతో మాట్లాడిన భువనేశ్వరి
ఏపీ అసెంబ్లీలో నేడు మాటల వైసీపీ, టీడీపీ నాయకుల మాటల యుద్ధానికి తెర లేపింది. కాగా చంద్రబాబు అరెస్టు విషయంపై మొదలై తెదేపా నేతలను సస్పెండ్ చేసే వరకు వచ్చింది. అయితే సస్పెన్షన్ అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు తన వృత్తిని అవమానిస్తేనే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. వైసీపీ,టీడీపీ సభ్యులు పోటాపోటీగా వాదోపవాదాలకు దిగారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసనసభ కొద్దిసేపటికే వాయిదా పడింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. కానీ సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.