Home / ఆంధ్రప్రదేశ్
తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న “యువగళం” పాదయాత్ర గురించి తెలిసిందే. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ కావడంతో పదయాత్రకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఏపీ హైకోర్టు రెగ్యులర్
: విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు ఆర్దిక సాయం చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ల యజమానులకు ఒక్కొక్కరికి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ జరిగింది.టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై మరోసారి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు అధికారం దక్కదని బీజేపీలో చేరి పదవి పొందారని పురందేశ్వరిపై మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబుకోసం కొమ్ముకాస్తున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ లో ధ్వజమెత్తారు.
మద్యం ఇవ్వలేదనే కోపంతో ఓ మందుబాబు ఏకంగా వైన్ షాపును తగాలబెట్టడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వైన్‌షాప్ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్ పోసి నిప్పంటించగా.. సిబ్బంది పరుగులు తీశారు. కానీ వైన్‌షాప్ మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15న ఆయన పర్యటన ఖరారు కాగా ఆరోజు వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్ వివరాలు..
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కానీ పలుచోట్ల మాత్రం విషాద ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో దీపావళి సంబరాల్లో భాగంగా తారాజువ్వలు పేలుస్తుండగా ఊహించని రీతిలో ఓ పూరింటిపై తారాజువ్వ పడింది.
రత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా.. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మైనారిటీ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే ఉత్సవాలను వైసీపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన జగన్ ప్రసంగిస్తూ.. ఎప్పటిలానే ప్రతి మాటకు ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, అంటూ తమని మోసం చేసాడని ముస్లిం వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఎంపీ విజయ సాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్‌పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి దర్యాప్తు సంస్థ సీఐడీకి అందించాలని డిమాండ్ చేశారు.
దీపం పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే హిందువులకు విశిష్టమైన దీపావళి పండుగ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చీకటి నుంచి వెలుగుల వైపు నడిపించేదే దీప జ్యోతి.. అటువంటి ఈ దీపాల పండుగ ప్రజలందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు.