TDP-Janasena Manifesto: టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీ భేటీ
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ జరిగింది.టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.
TDP-janasena Manifesto: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ జరిగింది.టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.
11 అంశాలతో మినీ మేనిఫెస్టో..(TDP-janasena Manifesto)
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇరు పార్టీల నేతలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నుంచి 6 అంశాలు, జనసేన నుంచి ప్రతిపాదించిన 5 అంశాలను చేర్చి ఉమ్మడిగా 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు.పేదలను సంపన్న చేసేలా మేనిఫెస్టో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించామని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో మీద పవన్, చంద్రబాబు బొమ్మలుంటాయని తెలిపారు. యువతకు భరోసా కల్పించే పధకాల అంశాలను మేనిఫెస్టోలో ప్రతిపాదించమన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి ఘనవిజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేసారు.
మరోవైపు జనసేన-తెలుగుదేశం పార్టీల మధ్య నియోజకవర్గ స్దాయిలో నిర్వహించే సమావేశాలు. ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన తరపున బాధ్యులను నియమించారు. ఉభయపక్షాల సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియమితులైన వీరు పర్యవేక్షిస్తారు. ఈ నెల 14వ తేదీ నుంచి మూడురోజుల పాటు ఉభయ పక్షాల నియోజకవర్గ స్దాయి ఆత్మీయ సమావేశాలు ప్రారంభవుతున్నాయి.