Home / ఆంధ్రప్రదేశ్
ఈనెల జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఒకవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు ఆలయ ట్రస్టు సభ్యులు ప్రముఖుల్ని ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
వైఎస్ఆర్సిపి అధినేత జగన్ పై తీవ్రస్దాయిలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విరుచుపడ్డారు.. తాను చేసిన తప్పు ఏంటో వైఎస్ జగన్ చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. ఐదేళ్ళుగా ఎప్పుడైనా జగన్ ఒక్కసారి అయినా తమని పిలిచి మాట్లాడారా అని ఎంఎస్ బాబు నిలదీశారు.
ఉత్తరాంధ్రలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి రాజీనామా లేఖని పంపించారు. ఆయన త్వరలో జనసేనలో చేరనున్నారు. రాజీనామాకు ముందు తన అనచరులతో సమావేశమయిన దాడి అనంతరం సీఎం జగన్ కు తన రాజీనామా పంపించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 4న షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. 4న ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలకు ఖర్గే ఆహ్వానం పలికారు. రాహుల్, ప్రయాంక, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. రెండు నెలల కిందట తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల ఢిల్లీలో రాహుల్, సోనియాలతో సమావేశమయిన విషయం తెలిసిందే.
వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబంలో జరగబోయే వేడుక గురించి ట్వీట్ చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, అట్లూరి ప్రియతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరుగనుందని షర్మిల ప్రకటించారు.
వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇకపై తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. షర్మిలతోనే తన రాజకీయ జీవితం ఉంటుందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజుసమీక్షలు నిర్వహించనున్నారు. కాకినాడ నగరంలో డివిజన్ల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం అవుతున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ను ఓడించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు అంబటి తిరుపతి రాయుడు వైఎస్ఆర్సిపిలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ క్రికెటర్ రాయుడికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి రాయుడు గత కొద్దకాలంగా ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పధకాలకు తన మద్దతు తెలుపుతూ వస్తున్నారు.