Home / ఆంధ్రప్రదేశ్
: విశాఖపట్టణం లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు . ఈ బస్సులను శనివారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు.
: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లో బంగారు ఉత్పత్తి కోసం జియో మైసూర్ సర్వేస్ కంపెనీ వేగం పెంచింది.ఈ ఏడాది చివరినాటికి తవ్వకాలు ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారి పై గుత్తి మండలం బాచుపల్లి దగ్గర కారు, లారీ ఢీ కొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో ఎన్నికల సందర్భముగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు చేసారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసారు
కాపుసంక్షేమ నేత ,సీనియర్ రాజకీయ వేత్త చేగొండి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాసారు .గత కొంతకాలంగా ఏపీలో ఎన్డీయే కూటమి విజయాన్ని కాంక్షిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు ,కూటమిలోని టీడీపీ కి సలహాలు ,సూచనలు చేస్తూ లేఖలు రాయడం తెలిసిందే.
నెల రోజుల నుంచి కొనసాగుతున్న గంగవరం పోర్టు కార్మికుల సమ్మె ఒక కొలిక్కి వచ్చింది. కార్మికులు శుక్రవారం నుంచి విధుల్లోకి వెళ్ళుతున్నారు . తమ జీతాలు పెంచాలని పోర్ట్ లోని నిర్వాసిత కార్మికులు ఏప్రిల్ 15 న సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. మరో వైపు అగ్రనేతలు మాత్రం యాత్రలకు బయలుదేరారు . ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా తీర్థయాత్రలు చేస్తున్నారు. మహారాష్ట్ర లోని పుణ్య క్షేత్రాలను చుడుతున్నారు
ఏపీలో ఇసుక మైనింగ్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులోనూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.
వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన మూడు రోజులకు ముఖ్యమంత్రి జగన్ బయటకి వచ్చి మాట్లాడారు . గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషణ చేసి అంచనా వేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని అన్నారు.