Home / ఆంధ్రప్రదేశ్
ఉద్యోగాల పేరుతో కాంబోడియాలో మోసపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు శనివారం ఉదయం విశాఖ ఎయిర్ పోర్టుకు క్షేమంగా చేరుకున్నారు. విశాఖకు చెందిన 20 మందికిపైగా బాధితులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు, ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పతాకశీర్షికల్లో ఉంటోన్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎల్ అండ్ టీ సిబ్బందితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు 7వ బ్లాక్‌లోని 15వ గేటును ఇటీవల ఎత్తారు.
ఏపీలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ ను ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఐఏఎస్‌కు రాష్ట్ర కేడర్ కు చెందిన గ్రూప్ 1 ఆఫీసర్ల ను ఎంపిక చేస్తారు .
మన్యం జిల్లా , హితుగూడెం దగ్గర అడవిదున్నమాంసాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ని పోలీస్ లు పట్టుకున్నారు . ఒరిస్సా లోని మల్కనగిరి ప్రాంతానికి చెందిన 13మంది వ్యక్తులు 7ద్విచక్ర వాహనాలు పై13 గోనె మూటలుతో 'అడవి దున్న ఎండిన మాంసాన్ని తరలిస్తుండగా జీకే వీధి పోలీసు పట్టుకున్నారు.
ఏపీలో ఒక మాజీ వాలంటీర్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది . వృద్ధురాలు నోటిలో గుడ్డలు కుక్కి ఒక మాజీ వాలంటీర్ బంగారాన్ని దోచుకెళ్లిన సంఘటన విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ గ్రామంలో చోటుచేసుకుంది.
ఏపీ వెళ్లి జగన్ పై పోరాడామని తాను గతంలోనే షర్మిలకు సూచించానని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి .హనుమంతరావు అన్నారు .తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ కళాశాలలో అమలా పురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో కలిసి అయన విలేకరులతో మాట్లాడారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటలు పడుతుంది . శుక్రవారం రద్దీ మరి ఎక్కువైంది . వారాంతరం కావడంతో రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది
శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లాల వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన సర్కిళ్లు, గ్రామాలు, నగర శివార్లలో సెర్చ్ ఆపరేషన్ చెప్పారు. ఈ డ్రిల్‌లో నిందితులు,
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ను నియమించాల్సిన సమయం వచ్చిందని టీడీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు . ఈ ఎన్నికల్లో 130 స్థానాలు కూటమిగెలుచుకుని చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు .
: ఏపీలో ఈ నెల 13న ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే ,తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కి హై కోర్ట్ లో ఊరట లభించింది .