Last Updated:

Former Volunteer Theft: వృద్ధురాలిపై మాజీ వాలంటీర్ ఘాతుకం

ఏపీలో ఒక మాజీ వాలంటీర్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది . వృద్ధురాలు నోటిలో గుడ్డలు కుక్కి ఒక మాజీ వాలంటీర్ బంగారాన్ని దోచుకెళ్లిన సంఘటన విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ గ్రామంలో చోటుచేసుకుంది.

Former Volunteer Theft: వృద్ధురాలిపై మాజీ వాలంటీర్ ఘాతుకం

Former Volunteer Theft :ఏపీలో ఒక మాజీ వాలంటీర్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది . వృద్ధురాలు నోటిలో గుడ్డలు కుక్కి ఒక మాజీ వాలంటీర్ బంగారాన్ని దోచుకెళ్లిన సంఘటన విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ గ్రామంలో చోటుచేసుకుంది. ముగడ గ్రామానికి చెందిన స్వాతి వాలంటీర్’గా పని చేసి ఎన్నికల ముందు రాజీనామా చేసింది. గ్రామంలో ఒంటరిగా వృద్ధురాలు అచ్చెమ్మ నివసిస్తుంది. ఒంటరిగా ఉన్న అచ్చెమ్మ నోటిలో గుడ్డలు కుక్కి ఆమె మరణించిందని భావించి మూడు తులాల బంగారాన్ని దోచుకుంది. స్పృహలోకి వచ్చిన వృద్ధురాలు ఎస్ఐ జయంతికు పిర్యాదు చేయడంతో చోరీ సంఘటన వెలుగులోకి వచ్చింది.

వాలంటీర్ల అఘాయిత్యాలపై గతంలోనే చెప్పిన పవన్..(Former Volunteer Theft)

పవన్ కళ్యాణ్ ఏపీలో వలంటీర్ల ముసుగులో కొంత మంది చేస్తున్న అఘాయిత్యాలపై ఎప్పటి నుంచో చెబుతూనే వున్నారు .అధికార వైసీపీకి కొమ్ముకాయడమే కాకుండా కుటుంబ సమాచారాన్ని తస్కరిస్తున్నారని ఆరోపించారు .కొంత మంది వాలంటీర్లు ఇళ్లల్లో వున్న ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారని ,అమ్మాయిలు మిస్ అవుతున్నారని పేర్కొన్నారు .కానీ ప్రభుత్వం దీనిని కొట్టిపారేసింది .తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటనలతో పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటలలో వాస్తవం ఉందని చెప్పక తప్పదు .

ఇవి కూడా చదవండి: