Home / ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్ లో ఉన్న సీడ్స్ దుస్తుల కంపెనీలో మరోమారు విషవాయువు లీకై అస్వస్థకు గురైన బాధితులు కోలుకుంటున్నారన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సీడ్స్ దుస్తుల కంపెనీలో మరోసారి విషవాయువు కలకలం రేపింది. ఈ ఏడాది జూన్ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా అదే కంపెనీలోని బి.షిఫ్టులో పనిచేస్తున్న 150 మంది మహిళా ఉద్యోగులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు
తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీవశిష్ట ఆశ్రమం ప్రధాన అర్చకుడు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది కింద నేపాల్ నుంచి వచ్చిన ప్రసాద్ శ్రీ వశీష్ట ఆశ్రమంలో అర్చకుడిగా చేరాడు. అంతకుముందు కాశీలో అర్చకత్వం చేసి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నుంచి శ్రీ వశీష్ట
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి పల్నాడు జిల్లా మాచర్లలో కన్నుమూశారు. ఆమె వయసు వంద సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సీతామహాలక్ష్మి కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో మాచర్లలో
బార్ పాలసీలో భాగంగా ఏపీలో బార్ లైసెన్సుల కోసం బిడ్డింగ్ ప్రారంభం అయ్యింది. జోన్ల వారీగా బార్ లైసెన్సులకు బిడ్డింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇవాళ ఉదయం 10గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ ఎన్రోల్మెంట్ చేసుకోనుంది ఏపీ ప్రభుత్వం.
భారత రాష్ట్రపతిగా కొనసాగుతున్న రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 24తో ముగియనుంది. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఈ నెల 25న ప్రమాణం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం రామ్ నాథ్ కోవింద్‌కు ఘనంగా వీడ్కోలు పలకనుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొని డ్రెడ్జింగ్ పనుల్నిప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.
ఇటీవల గోదావరికి భారీగా వరద నీరు రావడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 40. 5 మీటర్లు ఉన్న కాపర్ డ్యాంను 43.5 మీటర్లకు పెంచాలని నిర్ణయించింది. అనుకున్నదే ఆలస్యం. చకచకా పనులు ప్రారంభించి, రెండు రోజుల్లోని పూర్తి చేసింది ఏపీ సర్కార్.
మెగాస్టార్ చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీపీఐ నారాయణ కామెంట్ల పై నాగబాబు ట్విట్టర్ లో విమర్శించడంతో, అది మరికాస్త పెరిగింది. దాంతో చిరంజీవిపై చేసిన కామెంట్లపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఆయన పై చేసిన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకుంటున్నానని తెలిపారు.
తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వైసిపి దొంగ ఓట్లు వేయిస్తోందంటూ టీడీపీ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనితో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగ ఓట్లు వేసే వారిని పట్టుకున్నా