Last Updated:

Telangana Cabinet: సంక్రాంతికి కొత్త రేషన్‌కార్డులు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

Telangana Cabinet: సంక్రాంతికి కొత్త రేషన్‌కార్డులు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

Telangana Cabinet Key Decisions: హైదరాబాద్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. రైతు భరోసా విధివిధానాలపై చర్చ జరుగుతోంది. ఈ విధి విధానాలపై కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. భూమిలేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డులపై చర్చించారు. ఈ మేరకు సంక్రాంతికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కానుంది.

అలాగే 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయిం తీసుకుంది. అంతేకాకుండా కేబినెట్ ముందుకు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అందించింది. ఇందులో పంట పండిన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం.