Last Updated:

Ramayapatnam Port: రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొని డ్రెడ్జింగ్‌ పనుల్నిప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.

Ramayapatnam Port: రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్

Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొని డ్రెడ్జింగ్‌ పనుల్నిప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.

ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేయనుంది . మొత్తం 10వేల 6 వందల 40 కోట్ల రూపాయలతో 19 బెర్తులు నిర్మించేలా ప్రణాళికలు సిద్దం చేశారు అధికారులు. తొలిదశలో 8 వందల 50 ఎకరాల్లో 3వేల 7 వందల 36 కోట్లతో 4 బెర్తుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మూడేళ్ళలో 4 బెర్తులని నిర్మించేలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. 3వేల 773 ఎకరాల భూసేకరణ పనులు ఇప్పటికే పూర్తి చేశారు. పోర్టు పనులు పూర్తి అయితే కందుకూరు, కావలి పట్టణాలకి లాభం చేకూరనుంది. పొగాకు, గ్రానెట్, పప్పు దినుసులతో పాటు పలు ఉత్పత్తుల దిగుమతి, ఎగుమతులకి అనువుగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: