Last Updated:

Seethamahalakshmi Passed Away: పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి పల్నాడు జిల్లా మాచర్లలో కన్నుమూశారు. ఆమె వయసు వంద సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సీతామహాలక్ష్మి కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో మాచర్లలో

Seethamahalakshmi Passed Away: పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత

Andhra Pradesh: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి పల్నాడు జిల్లా మాచర్లలో కన్నుమూశారు. ఆమె వయసు వంద సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సీతామహాలక్ష్మి కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో మాచర్లలోని తన కుమారుడు నరసింహం ఇంటిలో ఆమె తుదిశ్వాస విడిచారు.

75 వసంతాల జెండా పండుగ సందర్భంగా గత ఏడాది సీఎం జగన్‌ మాచర్ల వచ్చి సీతామహాలక్ష్మితోపాటు కుటుంబ సభ్యులను సన్మానించి 75 లక్షల రూపాయలను అందించారు. వచ్చే నెల 2న పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సీతామహాలక్ష్మిని, ఢిల్లీ తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె మృతి చెందడంతో విషాదం అలముకుంది. సీతామహాలక్ష్మి మృతికి సీఎం జగన్‌ తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి: