AP Chief Electoral Officer: వాలంటీర్లను దూరంగా ఉంచండి
ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలకు గ్రామ, వార్డు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఛీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

Amaravati: ఇప్పటికే ఏదైనా, ఎవరికైనా అలాంటి పనులను అప్పగించివుంటే వెంటనే వారిని తొలగించాలని ఆదేశాల్లో తెలిపారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం పనులు కూడా వాలంటీర్లు చేపట్టేందుకు వీలులేదని ఇప్పటికే కోర్టు ఆదేశించివుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు ఏజెంట్లగా కూడా ఉండకూడదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సెల్ కో ఆర్డినేటర్ చేసిన ఫిర్యాదుతో సీఇవో ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.