Home / ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 7వ తేదీన మైదుకూరులో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్వహించే దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. విజయదశమి సందర్భంగా ఊరేగే ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నేడు ముగిసాయి. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం నాడు శ్రీవారికి చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకస్వాములు వైభవంగా నిర్వహించారు.
గడప, గడపకు కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి చిత్తూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓట్లు వేసి గెలిపిస్తే, బయట వ్యక్తులతో మాపై దాడులు చేయిస్తున్నారని స్థానికులు ఆయన్ను నిలదీశారు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ మార్పుపై అడిగిన ఓ స్పందనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానంగా ఓ నవ్వు నవ్వుతూ వెళ్లిపోయారు
వర్షాలు తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. శీతాకాలం వస్తున్నా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ భారీ వానల ధాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాగా కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది.
ఒక రాజధాని-అది అమరావతిగా పేర్కొంటూ అమరావతి రాజధానుల రైతుల తలపెట్టిన మహా పాద యాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అమరావతి టు అరసవళ్లి పేరుతో తలపెట్టిన పాదయాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర రైతులకు సాదర స్వాగతాలతో స్థానికులు, నీరాజనాలు పలికారు
గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఇటీవల జరిగిన సమీక్షలో వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని చెప్పి సీఎం జగన్ సీనియర్లకు షాక్ తినిపించారు
పవన్ కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమో అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి
నీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ మేరకు రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి చురకలు అంటించారు