Last Updated:

Narayana Swamy: చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి చేదు అనుభవం

గడప, గడపకు కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి చిత్తూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓట్లు వేసి గెలిపిస్తే, బయట వ్యక్తులతో మాపై దాడులు చేయిస్తున్నారని స్థానికులు ఆయన్ను నిలదీశారు

Narayana Swamy: చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి చేదు అనుభవం

Deputy Cm Narayana Swamy: గడప, గడపకు కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి చిత్తూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓట్లు వేసి గెలిపిస్తే, బయట వ్యక్తులతో మాపై దాడులు చేయిస్తున్నారని స్థానికులు ఆయన్ను నిలదీశారు. ఒక దశలో ఏమి మాట్లాడాలో తెలియక మంత్రి నారాయణ స్వామి ఇరకాటంలో పడ్డారు. చివరకు స్థానిక నేతలు ఆయనకు జేజేలు కొట్టి శాంతిప చేశారు. ఈ ఘటన ఉగ్రాణం పల్లిలో చోటుచేసుకొనింది.

వివరాల్లోకి వెళ్లితే…గడప గడప కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉగ్రాణం పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉంటున్న వారు వైకాపా నేతల ప్రవర్తిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మా కుటుంబసభ్యులను మీతో తిప్పించుకొని, ఇప్పుడు బయట వ్యక్తులతో కొట్టించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

ఆ సమయంలో పబ్లిక్ లో వద్దు, మనిద్దరం విడిగా మాట్లాడుకుందాం అని నేతలు మంత్రి నారాయణ స్వామి సమక్షంలో చెప్పడం విని ప్రజలు అవాక్కైనారు.  మాట్లాడుతున్న మహిళలను దూరంగా తోసేందుకు నేతలు ప్రయత్నించారు. దీంతో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తోయడమే నాయకత్వ లక్షణమా అంటూ ఆ మహిళ నిలదీసింది.

ఒక దశలో మహిళా పోలీసు మాట్లాడుతున్న మహిళను గట్టిగా అధమాయించింది. ఎమ్మెల్యే ముందు ఏంటా గట్టిగా మాటలు అంటూ ఆమెను పక్కకు తోసేసింది. పరిస్ధితి ఇలా ఉంటుందని ఊహించని ఉప ముఖ్య మంత్రి జోక్యం చేసుకొని స్థానిక నేతలు మాట్లాడుతారంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

రోడ్లేమైనా వేశారా? మనవాళ్లా అంటూ చూస్తూ రోడ్లు వేయడాన్ని ఆ మహిళ తప్పుబట్టింది. మిట్టమీద ఓట్లు నా కొడుకు వేయించిన్నప్పుడు మీకు తెలియదా అంటూ మహిళ పేర్కొనింది. స్థానికులపై ఎస్ఐ కూడా పరుషంగా మాట్లాడడంపై స్థానికులు తప్పుబట్టారు. సీఎం అక్కడ నుండి తంతే, ఇక్కడ గడప గడప అంటూ వస్తున్నారని విమర్శించారు. బ్రదర్ అంటే బూతుగా పోలీసులకు వినపడడం సిగ్గు చేటన్నారు.

పదిమందిలో అవమానించిన ఎస్ఐ పై ప్రైవేటు కేసు వేస్తానని స్థానిక న్యాయవాది ఒకరు ఒకింత అసహనంగా మాట్లాడారు. మొత్తం మీద గడప గడప కార్యక్రమం ద్వారా పిలిపించి కొట్టించుకొన్నట్లుగా వైకాపా నేతల పరిస్ధితి మారింది.

ఇది కూడా చదవండి: CM Jagan :సీనియర్ల ఎత్తులకు సీఎం జగన్ పై ఎత్తులు..

ఇవి కూడా చదవండి: