Home / ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప మాలలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం టోపీ ధరించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని బీజేపీ, బీజేవైఎం నేతలు మండిపడ్డారు. ఆయన ఇంటిని కూడా ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాగా తాను ముస్లిం టోపీ ధరించడంపై మాజీ మంత్రి వివరణ ఇచ్చారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే వైసీపీ సర్కార్ ఒత్తిడి నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఆలస్యమవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి చర్యలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిరింది.
విశాఖపట్నంలో ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన రశీదుపై అన్యమత కీర్తనలు ఉండటం కలకలం రేపింది. విశాఖ రైల్వే స్టేషన్లో ట్రాఫిక్ పోలీసు నిర్వహించే ప్రీపెయిడ్ ఆటోస్టాండ్‌లో ఇచ్చే ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లపై ఒక మతానికి సంబంధించిన కీర్తనలు ముద్రించి ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వావిళ్లలోని ఓ టిఫిన్సెంటర్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత కొద్ది రోజులుగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్న సంగంతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో నేడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత నెలకొంది. అడ్మిన్ బిల్డింగును ఉక్కు కార్మికులు ముట్టడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్తుని కాపాడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు టిడిపి నేత అయ్యన్నపాత్రుడు.
వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప దీక్షలో వుండి ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదాస్పదమైంది.