Home / ఆంధ్రప్రదేశ్
ఎన్నికల విధులు, జనగణన వంటి విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. . తమను విద్యాయేతర విధుల నుంచి తప్పించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.
2024లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం అవుతారంటూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య ధీమా వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని వైసీపీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రకటించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకా భార్య, కుమార్తెకు విచారణపై అసంతృప్తి ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జంతు హక్కుల స్వచ్ఛంద సంస్థ పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) సంయుక్త ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి దాదాపు 750 కిలోల గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు .
నిన్నమొన్నటి వరకు మంచి ధర పలికిన టమాట ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును ధర్మాసనం తప్పుబట్టింది
వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గత కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దానితో జగన్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులుపై దాడి జరిగింది. నగరంలోని ఆయన ఇంటి సమీపంలో రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు శ్రీనివాసులును కారుతో ఢీ కొట్టాడు.