Home / ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఇప్పుడు తాజాగా వార్తల్లో నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఈ మేరకు కిరణ్ కుమార్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టుగా సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లోనే కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం తాజాగా పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతుంది. సాధారణంగానే పవన్ కి సంబంధించి ఏదైనా విషయం ఉందంటే ఆయన ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారో తెలిసిందే. ఇక ఇప్పుడు ఒకేసారి రెండు విషయాలు కలిసి రావడంతో పవన్ పై అభిమానాన్ని చూపేందుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ చెలరేగుతున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణది మనసులో ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం. సాధారణంగా బాలకృష్ణ అంటే అందరికీ కొంత భయం ఉంటుంది. సీరియస్ గా , ముక్కుసూటిగా ఉంటారు అని … ఎక్కువ ఫ్రీ గా ఉండరేమో అని ఎక్కువగా అనుకుంటారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అదికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.
నేను తలచుకుంటే 10 సినిమాల్లో హీరోగా నటించి వాటిని సూపర్ హిట్స్ చేయగలను అంటూ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏకచిత్ర నటుడు అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో ఇటీవల నాలుగు పులి పిల్లలను గుర్తించిన విషయం తెలిసిందే. పులి కూనలను తల్లి వద్దకు చేర్చటానికి అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముసలిమడుగు గ్రామం దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ లో పులికూనలను… తల్లి పులిని కలిపేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆపరేషన్ మదర్ టైగర్ 108 పేరుతో యత్నాలు చేస్తున్నారు.
Vijayawada Education News : సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వడం లో అనుభవం కలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ, ఎస్.ఆర్.ఆర్ & సి.వీ.ఆర్ తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 7వ తేదిన విజయవాడలో ఎస్.ఆర్.ఆర్ & సి.వీ.ఆర్ కళాశాలలో తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బిఎస్ఎన్ దుర్గా ప్రసాద్, ఎస్ ఆర్ ఆర్ డిగ్రి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి పరస్పర అవగాహన ఒప్పందం పై సంతకం చేసారు. ఈ […]
ప్రశ్నించడం కోసం అంటూ 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది.
రాజధాని అంశంపై ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.