Home / ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. "దిగ్విజయ భేరి" పేరుతో జరగనున్న ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. బందరు శివర్లో 35 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు.
పవన్ కళ్యాణ్ సారధ్యం లోని జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. బందరు నగర శివారులో జరగనున్న ఈ వేడుక కోసం జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం జరిగే సభా వేదిక వద్దకు మొదటి సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో చేరుకోనున్నారు.
ఏపీలో జనసేన చేపట్టిన కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగడునా అడ్డుపడుతోంది. మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఆందోళన గురించి తెలుసని వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది.
JanaSena: నసేన ఆవిర్భావ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే బీసీ సదస్సు, కాపు సంఘాలతో ఆయన సమావేశాలు నిర్వహించారు.
MLC polls: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థలకు పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ నేతలతో ఆయన భేటీ అయ్యారు. కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. అలానే ఈ సమావేశంలో జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
జగన్ పోవాలి , పవన్ రావాలి అనేది కాపు సంక్షేమ సంఘం లక్ష్యం కావాలన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య చెప్పారు. ఆదివారంనాడు జరిన కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం జరిగే ఎన్నికల కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.
Pawan Kalyan: ఈనెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ అరాచక పాలనపై యుద్ధం ప్రకటించేందుకు జనసేన( JanaSena) అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ‘నేను సిద్ధం.. జన సైనికులారా మీరు సిద్ధమా!’ అని పవన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఈ క్రమంంలో శనివారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మంగళగిరి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన అక్కడి నుంచి […]